దేశాన్ని వణికిస్తున్న బర్డ్ ఫ్లూ.. నాలుగు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం శుక్రవారం అన్ని రాష్ట్రాలను కోరింది. ఏవియన్ ఇన్ఫ్లుఎంజాను బర్డ్ ఫ్లూ అని కూడా అంటారు. పక్షులు, కోళ్లు ఏవైనా అసాధారణంగా చనిపోతే అప్రమత్తంగా ఉండాలని, వెంటనే పశుసంవర్ధక శాఖకు సమాచారం అందించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా సంకేతాలు, లక్షణాల గురించి ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు/ప్రైవేట్ ప్రాక్టీషనర్లందరికీ అవగాహన కల్పించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించబడింది. అన్ని పౌల్ట్రీ ఫామ్‌లలో సమగ్ర భద్రతా అంచనాలు సిఫార్సు చేయబడ్డాయి.