సల్మాన్ ఖాన్‌ హత్యకు మరో పథకం…లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర భగ్నం

ప్రముఖ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను హత్య చేయడానికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన మరో ప్లాన్‌ను పోలీసులు భగ్నం చేశారు. ఇటీవల సల్మాన్ ఇంటి వెలుపల కాల్పులు జరిపిన ఇద్దరు షూటర్లను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే అంతకు నెల రోజుల ముందు , సల్మాన్ ని పన్వెల్ ఫామ్‌హౌస్‌లోనే హతమార్చడానికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరో ప్లాన్‌ను పన్నినట్లు నవీ ముంబై పోలీసులు తెలిపారు. నవీ ముంబయిలోని పన్వెల్ పోలీస్ స్టేషన్‌లో దాఖలైన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్, కెనడాకు చెందిన అతని బంధువు అన్మోల్ బిష్ణోయ్ మరియు సహచరుడు గోల్డీ బ్రార్, ఎకె-47 సహా అత్యంత అధునాతన ఆయుధాలైన ఎం-16 మరియు ఏకే-92 ను పాకిస్తాన్ నుంచి కొనుగోలు చేసి సల్మాన్ ను చంపాలనేది ప్లాన్ అని, ఇందుకోసం అతని వాహనాన్ని పక్కదారి పట్టించడం లేదా ఫామ్‌హౌస్‌పై దాడి చేయడమూ చేయాలని పథక రచన చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే సల్మాన్ బాంద్రా నివాసంలో కాల్పులు జరపడానికి ఇలా రెండో ప్లాన్ ఎందుకు వేశారో అనే విషయమై ఇంకా కారణాలు బైటకు రాలేదు.