హైదరాబాద్ మహానగరం‏లో ఉదయం 10.30 నుంచి విద్యుత్‌ సరఫరా బంద్..

మరమ్మతుల కారణంగా గ్రీన్‌ ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ బానోతు చరణ్‌ సింగ్‌ తెలిపారు. ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు 11 కేవీ విద్యుత్‌ టవర్స్‌, స్వరాజ్‌ నగర్‌ ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 12గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 11 కేవీ గ్రేహౌండ్స్‌, శ్రీరామ్‌ నగర్‌ ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 2 గంట ల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు 11 కేవీ హిందూ, సీతారామయ్య టవర్స్‌ ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు 11 కేవీ సోమాజిగూడ, శంకర్‌లాల్‌ నగర్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈ పేర్కొన్నారు.

బంజారాహిల్స్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ శ్రీనివాస్‌ తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ బంజారాహిల్స్‌ ఈ- సేవ కార్యాలయం, అక్బర్‌ ఫామ్‌ ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 11 కేవీ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-7 మెరిడియన్‌ స్కూల్‌, దృష్టి కంటి ఆస్పత్రి ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 2 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు 11 కేవీ బంజారాహిల్స్‌ రోడ్‌ 10లోని రెయిన్‌బో ఆస్పత్రి, కమలాపురి కాల నీ ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు బాబుఖాన్‌ చాంబర్స్‌, శ్రీనగర్‌ కాలని ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈ పేర్కొన్నారు.

సైఫాబాద్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ ప్రేమానంద్‌ పాయ్‌ తెలిపా రు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 11 కేవీ అనంద్‌నగర్‌ కాలనీ, నాసర్‌ స్కూల్‌ ఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 2 గంట ల నుంచి సాయంత్రం 4.30 వరకు 11కేవీ సోమాజిగూడ విజయ ఆస్ప త్రి, ఐఓఈ, ఎన్టీఆర్‌మార్గ్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈ పేర్కొన్నారు.