జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద 216 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం లో ఆరుగురు మృతి కలచివేసిందన్నారు. స్థానికులు చొరవ చూపి గాయపడిన వారిని బయటకు తీశారన్నారు.
అమరావతి: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద 216 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం లో ఆరుగురు మృతి కలచివేసిందన్నారు. స్థానికులు చొరవ చూపి గాయపడిన వారిని బయటకు తీశారన్నారు. ఈ సంఘటనలో చొరవ చూపిన స్థానికుల కు ధన్యవాదాలు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.
ఇవాళ ఉదయం కృష్ణా జిల్లా కృత్తివెన్ను వద్ద జాతీయ రహదారి 216పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మచిలీపట్నంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడో లేదంటే మరో కారణమో కానీ జాతీయ రహదారిపై కంటైనర్‌ను ఢీకొట్టాడు. కృత్తివెన్ను మండలం సీతనపల్లి దగ్గర ఘటన చోటు చేసుకుంది.