డార్లింగ్ ప్రభాస్ ఈ ఏడాదిలో కల్కి 2898ఏడీ సినిమాతో టాలీవుడ్ కి 1000 కోట్ల మూవీ అందించాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ టాలీవుడ్ పేరు దేశం మొత్తం వినిపించేలా కల్కి
సినిమాతో ప్రభాస్ చేశాడు. అలాగే హీరోగా తన మార్కెట్ ని కూడా యంగ్ రెబల్ స్టార్ అమాంతం పెంచుకున్నాడు. నెక్స్‌ట్ అతని లైన్ అప్ లో ఐదు సినిమాలు ఉన్నాయి. ప్రతి ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేస్తానన్న ప్రభాస్ ప్రామిస్ ఈ ఏడాది సాధ్యంఅయ్యేలా లేదు. నిజానికి మారుతి దర్శకత్వంలో చేస్తోన్న రాజాసాబ్ మూవీని 2024 డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదంట. షూటింగ్ ఇంకా చాలా వరకు పెండింగ్ ఉంది. తరువాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంది. ఈ సినిమాకి కూడా సీజీ వర్క్ బాగానే ఉందంట. అందుకే డిసెంబర్ లో వీలు కాదని అనుకుంటున్నారు. మళ్ళీ డార్లింగ్ ప్రభాస్ ప్రేక్షకులని పలకరించేది 2025 సమ్మర్ లోనే అని తెలుస్తోంది. 2025 ఆఖరులో సలార్ పార్ట్ 2 రిలీజ్ అవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ఈ ఏడాదిలో రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. అయితే ఏపీ ఎన్నికలలో అఖండ మెజారిటీ సాధించి పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ సీఎంగా ఆయన అధికారిక కార్యక్రమాలు చాలా నిర్వహిస్తున్నారు. మరో మూడు, నాలుగు నెలల వరకు సినిమాలకి సమయం కేటాయించలేనని పవన్ కళ్యాణ్ తేల్చేశారు. దీంతో ఓజీ మూవీ రిలీజ్ వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ ఓ 25 రోజులు డేట్స్ ఇస్తే సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోతుందంట. అయితే ఎప్పుడు పవన్ కాల్ షీట్స్ ఇస్తారనేది క్లారిటీ లేదు. అందుకే ఓజీ సినిమాని 2025 సమ్మర్ లో రిలీజ్ చేయాలని సుజిత్ టీమ్ ప్లాన్ చేసుకుంటుంది. ఈ లోపు పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్స్ అడ్జస్ట్ చేసుకొని షూటింగ్ ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. ఓజీ మూవీ తర్వాతనే హరిహరవీరమల్లు రిలీజ్ అవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది.