2024 జూన్ నెలలో బ్యాంకులకు భారీ సెలవులు రానున్నాయి. ఈ విషయమై ముందే తెలుసుకోకుంటే ఖాతాదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన బ్యాంక్ హాలిడేస్ జాబితా ప్రకారం జూన్ నెలలో దాదాపు 13 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఆ వివరాలు ఇవి.
జూన్ 1, 2024- ఈ రోజు ఎన్నికల జరిగే చోట బ్యాంకులకు సెలవు.
జూన్ 2, 2024- ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే
జూన్ 8, 2024- సెకండ్ శాటర్ డే కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జూన్ 9, 2024- ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు
జూన్ 10, 2024 – శ్రీ గురు అర్జున్ దేవ్ జీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పంజాబ్ రాష్ట్రంలో బ్యాంకులకు హాలిడే
జూన్ 14, 2024 – పహిలి రాజా కారణంగా ఒడిశాలో బ్యాంకులకు హాలిడే
జూన్ 15, 2024 – మిజోరాంలో వైఎంఎ దినోత్సవం, ఒడిశాలోని రాజా సంక్రాంతి కారణంగా అక్కడి బ్యాంకులకు సెలవు
జూన్ 16, 2024- ఆదివారం కారణంగా అన్ని బ్యాంకులకు సెలవు
జూన్ 17, 2024 – బక్రీద్ సందర్భంగా కొన్ని రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలుడే
జూన్ 21, 2024 – వట్ సావిత్రి ఉపవాసం కారణంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలిడే
జూన్ 22, 2024- నెలలో నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
జూన్ 23, 2024- ఆదివారం కారణంగా అన్ని బ్యాంకులకు సెలవు
జూన్ 30, 2024- ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు