ఐదేళ్లపాటు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, మారణకాండకు తగిన మూల్యం చెల్లించుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు చిత్తుచిత్తుగా ఎందుకు ఓడించారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవుపలికారు.
AP Politics: చిత్తుచిత్తుగా ఎందుకు ఓడిపోయారో ఆత్మ పరిశీలన చేసుకోండి: ఎమ్మెల్సీ అనురాధ
అమరావతి: ఐదేళ్లపాటు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, మారణకాండకు తగిన మూల్యం చెల్లించుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు చిత్తుచిత్తుగా ఎందుకు ఓడించారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవుపలికారు. అలా చేయకుండా ఓడిపోయిన మరుసటి రోజు నుంచే శవ రాజకీయాలు మొదలుపెట్టారంటూ మండిపడ్డారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవంటూ వైసీపీ నేతలు రాష్ట్రపతిని కలవటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. వైసీపీ అంటేనే శవ రాజకీయాల పార్టీ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం పదవి కోసం తండ్రి శవం పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించింది, 2019లో బాబాయి శవాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసింది జగన్ రెడ్డి కాదా? అని ఆమె ప్రశ్నించారు.