పవన్ కళ్యాణ్ అంటే అవధుల్లేని అభిమానం కలిగిన ఓ యువతి కష్టసాధ్యమైన కార్యానికి పూనుకొని ఔరా అనిపించింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పసుపు లేటి దుర్గా రామలక్ష్మి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తిరుమల కొండపైకి సుమారు 450 మెట్లు మోకాళ్లపై ఎక్కి మొక్కుకుంది. జనసేనాని పవన్ ఎలాగైనా గెలవాలన్న కోరికతోనే తాను ఇలా మోకాళ్లపై మెట్లు ఎక్కినట్లు తెలిపింది. వివరాల్లోకి వెళితే ఉండ్రాజవరంకు చెందిన పసుపులేటి దుర్గా రామలక్ష్మి ఆర్ఎంపీ వైద్యురాలుగా పనిచేస్తుంది. ఆమెకి పవన్ అంటే ప్రాణం. ఈ ఎన్నికల్లో పవన్‌ను ఖచ్చితంగా గెలిపించాలని ఆమె తిరుమల శ్రీవారిని మొక్కుకున్నారు. ఆ మొక్కులో భాగంగా మే 25న తిరుమల వెళ్లి సుమారు 450 మెట్లు మోకాళ్లపై ఎక్కినట్లు రామలక్ష్మి మీడియాకు తెలిపారు. రాజకీయ పార్టీలతో తనకు సంబంధం లేదని, కేవలం పవన్ కల్యాణ్‌పై ఉన్న అభిమానంతోనే ఇలా మోకాళ్లపై మెట్లు ఎక్కి మొక్కుతీర్చుకున్నట్లు ఆమె విరించారు. ఈసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీచేస్తున్న పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని రామలక్ష్మి ధీమా వ్యక్తం చేస్తున్నారు.