Subrahmanyam Marthi
విశాఖపట్నం: బీసీ రౌండ్ సమావేశంలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు.ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది బీసీలు ఉన్నారు. వారి సమస్యలపై చర్చించాం. 139 కులాలు ఉన్నాయి. చాలా కులాలు వృత్తి మీద ఆధారపడినవే ఉన్నాయి. ప్రతి కులానికి సమస్యలు ఉన్నాయి..
ఆర్థిక, సాంఘిక సమానత్వం బీసీలకు కావాలి. రావాలి. బీసీలకు పొలిటికల్ ఎన్పవర్మెంట్ కావాలి. బీసీల్లో ఐక్యత అవసరం.బీసీలకు పొలిటికల్ రిజర్వేషన్ ఉండాలి. చట్ట సభలో రిజర్వేషన్లు కావాలి. బీసీ జనగణన జరగాలి. టీడీపీ అధికారంలో వచ్చిన వెంటనే సెన్సెస్ నిర్వహిస్తాం.ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంటే…ప్రజలకే నష్టం. వచ్చే బడ్జెట్‌లో బీసీలకు ఎక్కువ కేటాయింపులు ఉండడానికే బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. విశాఖకు రాజధాని తెస్తున్నామని చెప్పి.. వైజాగ్ లో భూములు దోచేస్తున్నారు.” అని యనమల ఆరోపించారు.