
ట్విటర్ (ఎక్స్) మరియు టెస్లా అధినేత ఎలన మస్క్ స్టేజీ పై నిప్పులు చెరిగారు. తన సోషల్ మీడియా వెబ్సైట్ పై ఉన్న ప్రకటనదారులపై దురుసు బాషతో మాట్లాడారు. మస్క్ మాటతీరు మరియు వ్యవహారణ శైలిపై ఇప్పటికే ఎన్నో విమర్శలు వాస్తు ఉన్న మస్క్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
తాజాగా మస్క్ ఒక సమ్మిట్ కి ముఖ్య అతిది గా వెళ్ళగా అక్కడ తనని అడిగిన ప్రశ్నలకు జవాబు ఇస్తూ “నన్ను డబ్బుతో లేదా ప్రకటనల పెరితో బ్లాక్ మెయిల్ చేస్తారా?” అంటూ దురుసు పదాలను వాడారు. తరువాత “ఇప్పుడు క్లియర్ గా ఉందా?” అని మాట్లాడారు.
మస్క్ నవంబర్ 16న ఒక వ్యక్తి యొక్క యాంటీ-సెమిటిక్ ట్వీట్ కి “మీరు చెప్పింది నిజం” అని రిప్లయ్ ఇచ్చారు. ఈ ట్వీట్ ని చూసి ఎన్నో దిగ్గజ వ్యాపారాలు తమ ప్రకటనలు x నుంచి తొలగించారు.
తను చేస్తున్న పనితీరు సరియేన అని ఆడగగా, మస్క్ కేవలం ఒక చిరునవ్వు నవ్వారు.