Mahanaadu-Logo-PNG-Large

టెన్‌మినిట్స్‌ఉన్నా టెన్‌ ఇయర్స్‌ గుర్తుండే క్యారెక్టర్‌ చేస్తా-నిహిర్‌ కపూర్‌

పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా హీరో నిహిర్ కపూర్ మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ. నేను ముందు గ్యాంగ్ స్టర్ గంగరాజు సినిమా చేశాను. ఆ సినిమా చేస్తున్న సందర్భంలో చదలవాడ శ్రీనివాసరావు గారు చాలా బాగా చేసావు ఒక కథ ఉంది ఆ కథకు నువ్వు యాప్ట్ అవుతావు అని చెప్పారు. కథ వినగానే చాలా ఎక్సైటింగ్ గా అనిపించి చేస్తానని ఒప్పుకున్నాను. హీరోగా అని కాకుండా క్యారెక్టర్రైజేషన్ చాలా బాగుండడంతో ఈ కథ ఒప్పుకున్నాను. ఇద్దరు అనాధలు అడవిలో పెరుగుతూ ఉంటాం. మేము ట్విన్స్. అడవి నుంచి కుస్తీ పోటీలు నేర్చుకుని సిటీకి వచ్చి ఇంటర్నేషనల్ లెవెల్ లో డబ్ల్యూ డబ్ల్యూ ఈ దాకా వెళ్లడం ఆ ప్రయాణాన్ని చాలా బాగా చూపించారు. ఇది కూడా కమర్షియల్ సినిమా నే. దంగల్ తో కంపారిజన్ ఉండదు. అందులో కుస్తీ పోటీలు ఇవన్నీ డీటెయిల్ గా ఉంటాయి. ఇందులో కుస్తీ పోటీల గురించి చెబుతూ ఇద్దరు అనాధల జర్నీ ఇంటర్నేషనల్ లెవెల్ దాకా వెళ్ళింది అలాగే సెంటిమెంట్ ఎమోషనల్ అన్ని కలగలిపిన ఒక కమర్షియల్ సినిమాగా ఉంటుంది. మంచి మదర్ సెంటిమెంట్ సాంగ్స్ ఫైట్స్ అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి.
ఇందులో డబ్ల్యూ డబ్ల్యూ పోటీలు చూపిస్తున్నాము. కుస్తీ పోటీల నుంచి డబ్ల్యు డబ్ల్యు ఈ దాకా జరిగే ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. రాజస్థాన్ హర్యానా లాంటి ప్రాంతాల్లో కుస్తీ పోటీలు ఎక్కువగా జరుగుతాయి ఆ డీటైలింగ్ మీద నార్త్ వాళ్ళు ఎక్కువ సినిమాలు తీస్తారు. కానీ మన సినిమాలో కుస్తీ పోటీలతో పాటు మిగతా ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇది తెలుగు సినిమా అయినా ప్రతి భారతీయుడు చూసి గర్వించదగ్గ సినిమా. ఇలాంటి సినిమా తెలుగుతోనే ఆగిపోకూడదు. అందుకే ఎనిమిది భాషల్లో వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ చేస్తున్నాం. రీసెంట్ గా కన్నడ చెన్నై వెళ్లి అక్కడ ప్రమోట్ చేయడం జరిగింది. కన్నడలో రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ముంబైలో కూడా ఇలాంటి కథలు ఎక్కువగా చూస్తారు అక్కడ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంకా మలయాళం ఒడియాలో కూడా నెక్స్ట్ ప్రమోట్ చేస్తున్నాము.