Mahanaadu-Logo-PNG-Large

ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్..

-డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో విచార‌ణ
-అహం దెబ్బ‌తిన‌డం వ‌ల్లే హ‌త్య అన్న పోలీసులు
-డ్రైవ‌ర్ శ‌రీరాన్ని మ‌రింత గాయ‌ప‌ర్చి ప్ర‌మాదంగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నమ‌ని వ్యాఖ్య‌
-ప్ర‌స్తుతం రాజ‌మ‌హేంద్ర వ‌రం జైలులో అనంత‌బాబు

ఏపీలోని వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో విచార‌ణ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ను పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అనంత బాబును పోలీసులు రాజ‌మ‌హేంద్రవ‌రం జైలుకు త‌ర‌లించారు.

సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని తానే చంపిన‌ట్లు అనంత‌బాబు అంగీక‌రించార‌ని ఇప్ప‌టికే కాకినాడ‌ పోలీసులు చెప్పారు. అహం దెబ్బ‌తిన‌డం వ‌ల్లే ఎమ్మెల్సీ ఈ హ‌త్య చేశాడ‌ని పోలీసులు అంటున్నారు. సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని తోసేయ‌డం వ‌ల్ల అత‌డు గాయ‌ప‌డి చ‌నిపోయాడ‌ని, ప్ర‌మాదంగా చిత్రీక‌రించేందుకు అత‌డి శ‌రీరాన్ని మ‌రింత గాయ‌ప‌ర్చార‌ని పోలీసులు చెప్పారు.