తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిజాయితీగా విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారనే కారణంతో ముగ్గురు పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు పోలీసు అధికారులపై తెలంగాణ సీఎస్‌కు లేఖ రాసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వారు తమ విధులను సక్రమంగా నిర్వహించలేదని, నేరస్తులను రక్షించే ప్రయత్నం చేయలేదని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ యాదగిరి, సీఐ జహంగీర్‌లను సస్పెండ్ చేశారు.