రానా దగ్గుబాటి ప్రౌడ్లీ ప్రెజెంట్స్ – నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ “35-చిన్న కథ కాదు” హార్ట్ వార్మింగ్ టీజర్ లాంచ్. నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్.”35-చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. టీజర్‌ని విడుదల చేసి మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ నడుస్తుంది. యంగ్ ఏజ్ లోనే విశ్వదేవ్‌ని పెళ్లాడిన నివేదా థామస్‌కి స్కూల్‌కి వెళ్లే అబ్బాయి ఉంటాడు. తను చదువులో పూర్. పాస్ మార్కులు (35) సాధించడంలో విఫలమవడంతో ఫ్యామిలీలో నిరాశకి దారితీసింది.
దర్శకుడు నంద కిషోర్ ఈమానీ హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో అందరూ రిలేట్ చేసుకునే సబ్జెక్ట్‌తో ప్రశంసలు అందుకున్నాడు. భావోద్వేగాలు చాలా ప్యూర్ గా వున్నాయి. అతను నెరేటివ్ కి సమానంగా ఎంటర్ టైన్మెంట్ ఉండేలా చూసుకున్నాడు. డైలాగ్స్ ఇంపాక్ట్ ఫుల్ గా వున్నాయి.
నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు, చిన్న బాబు కూడా ఆకట్టుకున్నాడు. నికేత్ బొమ్మి కెమెరా పనితనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎమోషన్ ని ఎలివేట్ చేసింది. విజువల్ అప్పీల్ యాడ్ చేస్తూ ప్రొడక్షన్ డిజైన్‌ను లతా నాయుడు అందించారు. టి సి ప్రసన్న బ్రిలియంట్ గా ఎడిట్ చేసారు.