సంగారెడ్డిలో జిల్లా పోలీస్ తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు రూరల్ పోలీసుల తనిఖీల్లో రెండు బోలెరో వాహణాల్లో 635 కిలోల మీద గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. రెండు వాహనాల డ్రైవర్లను మరియు క్లీనర్లను అదుపులోకి తీస్కున్నరు పోలీసులు.
బోలెరో వాహనాలను మోడిపై చేసి వాహనపు చేసిస్ కింద భాగంలో ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేసి అందులో గంజాయిని తరలిస్టునట్టు గుర్తించారు పోలీసులు. TS 08 UJ 8769, MH 27 BX 7748 వాహన నుమబర్లతో వచ్చిన వాహనాలను సీజ్ చేసి, డ్రగ్స్ సరఫరా చేస్తున్న డ్రైవర్లను మరియు ఒక క్లీనరను అరెస్ట్ చేశారు పోలీసులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సా లోని జాన్ భాయి ఏజెన్సీ లో ఉండే త్రినాథ్ అనే వ్యక్తి నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు ఈ గంజాయి ని తరలిస్తున్నారు. మొత్తం గంజాయి విలువ సుమారు 3 కోట్లు ఉంటుంది అని పోలీసులు వివరించారు.