రాయల్ రూలర్ స్కేటింగ్ క్లబ్ వారి ఆధ్వర్యంలో 70 కిలోమీటర్లు స్కేటింగ్ ర్యాలీ

ఎన్టీఆర్ జిల్లా(విజయవాడ) – నగరానికి చెందిన రాయల్ రూలర్ స్కెటింగ్ క్లబ్ వారు ఈ నెల 29 న నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా స్కెటింగ్ ఆన్ రోడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారి దగ్గర కఠోర సాధన తో శిక్షణ పొందిన 15 మంది విద్యార్థులుతో ఆదివారం ఉదయం విజయవాడ నుండి మచిలీపట్నం వరకు సుమారు 70 కిలోమీటర్ల స్కెటింగ్ తో ర్యాలీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ ర్యాలీలో పిల్లలు అందరూ 12 నుండి 14 సంవత్సరాలు వారు వుండడం చూపరులకు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది.