జనసేన అధినేత పవన్ కళ్యాణ్
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా చంద్రబాబు బెయల్‌పై స్పందించారు. చంద్రబాబుకి హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం. చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు బెయిల్‌పై రావడాన్ని అందరం ఆయన్ని స్వాగతిద్దామని పవన్ కళ్యాణ్ తెలిపారు.