– 153ఏ అండ్ అదర్స్ సెక్షన్ల కింద కేసు రిజిష్టర్ చేసి జూపూడిని అరెస్టు చేయాలి
– సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడమేనా సలహాదారుల ఉద్యోగం?
– జూపూడి భజన చేసుకోవాలిగానీ బ్రాహ్మణ కులాన్ని కించపరిచే రీతిలో మాట్లాడడమేల?
– వైసీపీ ప్రభుత్వ సలహాదారుడు జూపూడి ఏరోటి దగ్గర ఆ పాట పాడతారు
-ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం జూపూడిది
– దళిత యువతిపై గ్యాంగ్ ముఠా నాయకుడు వెంకటరెడ్డి ని ఇప్పటికీ అరెస్టు చేయలేదు
– చంద్రబాబును అపర అంబేద్కర్ అని పొగిడింది మీరు కాదా?
– ఇప్పుడెలా జగన్ మీకు అపర అంబేద్కర్ అయ్యారు?
-ఊసరవెల్లి కూడా జపూడిని చూసి సిగ్గుపడుతుంది
రాజకీయాల్లో భజనకు బ్రాండ్ అంబాసిడర్ జూపూడి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
వైసీపీ ప్రభుత్వ సలహాదారుడు జూపూడి ఏరోటి దగ్గర ఆ పాట పాడతారని, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం జూపూడిదని, ఊసరవెల్లి కూడా జపూడిని చూసి సిగ్గుపడుతుందని
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడిన మాటలు …
నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ సామాజిక సాధికార బస్ యాత్ర లో దళితులను మభ్య పెట్టాలన్నదే జూపూడి ఆలోచన. కాలి బూటు కొలత తీసుకున్నవాడు ఒక బ్రాహ్మణుడు అని వ్యంగంగా జూపూడి చెప్పడం తప్పు. జగన్ కు భజన చేస్తూ జూపూడి రెండు వర్గాల మధ్య, రెండు కులాల మధ్య వైషమ్యాలు రేకెత్తించడం క్షంతవ్యం కాదు. చంద్రబాబు హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా రెండు దఫాలు పనిచేసిన జూపూడి, జగన్, చంద్రబాబులో ఎవరు దళిత సంక్షేమం బాగా చూశారో బహిరంగ చర్చకు రాగలరా? ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా చంద్రబాబు హయాంలో జూపూడి ఎన్ని ఇన్నోవా కార్లు దళితులకు ఇచ్చారు?, జగన్ ముఖ్యమంత్రిగా ఎన్ని కార్లు ఇచ్చారో? జూపూడి చెప్పాలి.
జూపూడి ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఎన్ని వేల ఎకరాల భూమిని దళితులకు ధారాదత్తం చేశారు?, జగన్ హయాంలో ఎన్ని వేల ఎకరాలిచ్చారో జూపూడి చెప్పాలి. 14.04.2016న ముఖ్యమంత్రి చంద్రబాబును అపర అంబేద్కర్ అని పొగిడింది మీరు కాదా? ఇప్పుడెలా జగన్ మీకు అపర అంబేద్కర్ అయ్యారు? దళిత వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ ను జగన్ ప్రభుత్వం దారుణ మరణానికి గురిచేసినప్పుడు జూపూడి ఎందుకు నోరెత్తలేదు? జగన్ ను ప్రశ్నించలేదు?.
ఇసుక అక్రమ దందాను ప్రశ్నించిన దళిత యువకుడు వరప్రసాద్ కు పోలీసు స్టేషన్ లో శిరోముండనం చేస్తే జూపూడి ఎందుకు నోరెత్తలేదు?. దళిత ద్రైవర్ సుబ్రమణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబు దారుణంగా హత్య చేసి డోర్ డెలివరి చేస్తే జూపూడి నోరెందుకు పెగల్లేదు? ఇప్పుడెందుకు జగన్ భజన చేస్తున్నారు?
33 వేల కోట్ల రూపాయలు సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తే జూపూడి ఎందుకు నోరెత్తలేదు? ఇప్పుడెందుకు జగన్ భజన చేస్తున్నారు? దళిత యువకుడు శ్యామ్ కుమార్ ను కొట్టి అతని నోట్లో మూత్ర విసర్జన చేస్తే జూపూడి నోరు ఎందుకు మూగబోయింది?, ఇప్పుడెందుకు జగన్ భజన చేస్తున్నారు?కిరణ్ కుమార్ చావు, ఓంప్రతాప్ చావు, వెటర్నరీ ఛీఫ్ డాక్టర్ అచ్చె్న్న చావు, నాగమ్మ మరణం, అనూష మరణం, రమ్య చావు అన్నీ మిష్టరీగా మిగిలిపోతే జూపూడి జగన్ ను ఎందుకు ప్రశ్నించలేదు?, ఇప్పుడెందుకు జగన్ భజన చేస్తున్నారు? ఆనాడు వైఎస్సార్ ను అపర అంబేద్కర్ అన్నది జూపూడే కదా, రోశయ్యను అపర అంబేద్కర్ అన్నది జూపూడే కదా, కిరణ్ కుమార్ రెడ్డిని అపర అంబేద్కర్ అన్నది జూపూడే కదా? చంద్రబాబును అపర అంబేద్కర్ అన్నది కూడా జూపూడే కదా? ఇప్పుడు జగన్ ను కూడా అపర అంబేద్కర్ గా పోలుస్తూ తాను పెద్ద భజనపరుడని దళితులకు చాటి చెప్పారు.
రెండు వర్గాల మధ్య వైషమ్యాలు లేపే విధంగా పబ్లిక్ మీటింగ్ లో ఉపన్యసించిన జూపూడిని వెంటనే అరెస్టు చేసి చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలి. జూపూడి మాటలు విని జగన్ కు మద్దతు తెలపటానికి రాష్ట్రంలో దళితులెవరూ సిద్ధంగా లేరని జూపూడి గ్రహించాలి. ఒక అగ్ర కులాన్ని కించపరిచేలా జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడారు. జగన్ ప్రభుత్వానికి సలహాదారుడిగా జూపూడి ఏమాత్రం సరికాడు. దళితవర్గాన్ని మభ్యపెట్టేలా, వైసీపీ బస్ యాత్రలో అబద్దాలు చిత్రీకరించేలా మాట్లాడారు. జూపూడి భజన బాగా చేస్తాడన్నది అందరికీ తెలిసిన విషయమే. దళిత ద్రోహి జగన్‌మోహన్ రెడ్డి అయితే రాజకీయాల్లో భజనకు బ్రాండ్ అంబాసిడర్ జూపూడి.
దళిత వర్గాల్లో బీసీ వ్యతిరేకత వెల్లుబికినప్పుడు, వ్యతిరేకత విపరీతంగా చోటు చేసుకున్నప్పుడు మాత్రమే వైసీపీకి బస్ యాత్రలు గుర్తుకొస్తాయి. కావలిలో సాధికార బస్ యాత్రలో జూపూడి మాట్లాడిన మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయి. జగన్ ప్రభుత్వం పట్ల దళిత వర్గాలు ఈసడించుకుంటున్నాయి. ఎప్పుడు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని దళిత వర్గాలు భీష్మించి కూర్చున్నాయి. వళ్లు మరచి రెండు వర్గాల్లో వైషమ్యాలు కరేకెత్తించేలా జూపూడి మాట్లాడారు. జూపూడి మాటలు జుగుప్సాకరంగా, ఏహ్య భావాన్ని రేకెత్తించేలా, రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచేలా ఉన్నాయి. సజ్జల, జూపూడీలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోసేవారో, సలహాలిచ్చేవారో తెలియడంలేదు. జూపూడి రెండు మూడు లక్షలు జీతం తీసుకుంటూ ఇలాంటి సలహాలా ప్రభుత్వానికి ఇచ్చేది?.
జూపూడి భజన చేసుకోవాలిగానీ బ్రాహ్మణ కులాన్ని కించపరిచే రీతిలో మాట్లాడడమేల?. డీజీపీ కలుగజేసుకొని జూపూడిని అరెస్టు చేయాలి. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇన్నోవా కంపెనీ కార్లు, ట్రాక్టర్లు వేలాదిమందికి జీవనోపాధి కల్పించిన విషయం మరిచారా?. దళిత వ్యక్తి సుధాకర్ మూడు మాస్కులు అడిగిన పాపానికి శవమై తేలితే జగన్ ప్రశ్నించలేదు. డ్రైవర్ సుబ్రమణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబు బ్రతికుంటే ఆస్పత్రికి తీసుకెళ్లు, చస్తే స్మశానానికి తీసుకెళ్లమంటే అడ్వయిజర్ గా జూపూడి నోరు పెగలలేదు. జగన్, జూపూడి చేతిలో దళితులు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు.
పోలీసులు సహకరించడంతో వైసీపీవారు దోమతోటి విక్రమ్ అనే యువకుడిని పొట్టన పెట్టుకున్నారు. ఒక కులాన్ని కించపరుస్తుంటే జగన్ ఎలా ఊరుకుంటాడు? రాజుల వద్ద చేసే భజన కంటే జూపూడి జగన్ కు చేసే భజనే ఎక్కువగా ఉంది. ఎస్సీ సెల్ కార్పొరేషన్ ఛైర్మన్ గా చంద్రబాబు రెండవసారి జూపూడిని చేశారు. బెస్ట్ అవలబుల్ స్కూల్స్ పెడితే చంద్రబాబుకు కూడా జూపూడి ఆకాలంలో భజన చేశాడు. అంబేద్కర్ విదేశీ విద్య పేరు తీసి జగనన్న విదేశీ విద్య అని పెరు పెట్టారు, జగన్ అంబేద్కర్ కన్నా గొప్పవాడా? కంచికచర్లలో దాహం అన్న దళితుడిని కారులో నుంచి దించి నలుగురు చుట్టు ముట్టి మూత్ర విసర్జన చేయడం వింటుంటేనే మనసు చివుక్కు మంటోంది. ధైర్యముంటే జూపూడి సలహాదారు పదవికి రాజీనామా చేసి రావాలి.
పౌరుషముంటే దళితులెవరూ జగన్మోహన్ రెడ్డితో ఉండకూడదని జూపూడి వైసీపీ నుండి బయటికి రావాలి. దళితుల అభ్యున్నతి కోరేది తెలుగుదేశం, నారా చంద్రబాబు మాత్రమే అని గ్రహించాలి. సీఎం నివాసానికి కూతవేటు దూరంలో దళిత యువతిపై గ్యాంగ్ ముఠా నాయకుడు వెంకటరెడ్డి ని ఇప్పటికీ అరెస్టు చేయలేదు. భూమి కొనుగోలు పథకం (ల్యాండ్ పర్చేజింగ్ స్కీమ్) ను రద్దు చేశారు. ధర్మవరం స్నేహలతను అనంపురం జిల్లా ధర్మవరంకు చెందిన జాతీయ స్థాయి జూనియర్ క్రీడాకారిణి వైసీపీ గూండాలు అత్యాచారం హత్యకు పాల్పడినా చర్యలు లేవు.
దళితుల ద్వేషిగా ఉన్న వైసీపీకి సలహాదారులుగా ఉన్న మిమ్మల్ని ఏమనాలి? దళితులకు మేనమామ అనే జగన్ కనీసం ఒకసారి అయినా దళితులకు మేలు చేశావా అని జగన్ ను జూపూడి అడగలేదు. 153ఏ అండ్ అదర్స్ సెక్షన్ల కింద కేసు రిజిష్టర్ చేసి జూపూడిని అరెస్టు చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.