జీవీఎల్ చొరవతో వేగంగా ముందుకు కదిలిన విశాఖ రైల్వే జోన్

– 106 కోట్లతో విశాఖ నూతన జోన్ భవన నిర్మాణానికి రైల్వే బోర్డు ఆమోదం

బిజెపి ఎంపి జీవీఎల్ నరసింహారావు విశాఖ ఈస్ట్ కోస్ట్ రైల్వే డి.అర్.ఎం సౌరబ్ ప్రసాద్ ని కలిసి నూతన రైల్వే జోన్ కు సంబందించిన వివిధ ముఖ్య విషయాల పై చర్చించడం జరిగింది. ప్రధానంగా విశాఖ కేంద్రంగా ఆమోదించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు సంబందించి .. రైల్వే శాఖ నుండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న భూమికి బదులుగా జరిగిన భూ కేటాయింపులు, నూతన జోన్ భవనానికి రైల్వే బోర్డు నుండి, గత వారం అనుమతి పొందిన పూర్తి స్థాయి భవన నిర్మాణ వ్యయం తదితర విషయాలపై కూలంకషంగా చర్చ జరిగింది. ఎన్నో దశాబ్దాలుగా విశాఖపట్నం మరియు ఉత్తరాంధ్ర ప్రజలకు సెంటిమెంట్ గా మారిన. విశాఖ రైల్వే జోన్ విషయంలో ఎంపీ జీవీఎల్ తన స్పీడ్ ను పెంచారు

రైల్వే బోర్డు చైర్మన్ ఇతర అధికారులతోనూ, పలుమార్లు రైల్వే శాఖ మంత్రి తోనూ ఎప్పుడు సంప్రదిస్తూ సమావేశం అవుతూ విశాఖ రైల్వే జోన్ కు కావలసిన వివిధ రకాల కేటాయింపులు తదితర విషయాలపై వివరాలను ఎప్పటికప్పుడు అందజేస్తున్న నేపథ్యంలో.. గతవారం విశాఖ రైల్వే జోన్ నూతన భవన నిర్మాణాలకు గాను.106 కోట్ల రూపాయలకు ఆమోదం లభించింది.ఆ నిధులను రైల్వే బోర్డ్ భవన నిర్మాణాలకు ఏవిధంగా ఖర్చు చేస్తారనే వివరాలను జీవీఎల్ మీడియాకు వెల్లడించారు.

రైల్వే జోన్ నిర్మాణం కోసం భూమిని ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వ జాప్యం
ప్రతిపాదిత రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం ముడసర్లోవాలో కేటాయించబడి నదని ఎంపి జీవీఎల్ తెలియచేశారు.అయితే రాష్ట్ర ప్రభుత్వం రైల్వేకు ఇవ్వాల్సిన 52 ఏకరాల భూమిని ఇవ్వటంలో తీవ్ర జాప్యం చేస్తోందని ఎంపి జీవీఎల్ తెలియజేసారు. రైల్వే శాఖకు ఈ భూమి అందచేయబడిన వెంటనే , మండల ప్రధాన కార్యాలయ నిర్మాణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ఎంపి జీవీఎల్ వెల్లడించారు.