మంథని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు ఎన్నికల ప్రచారాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితులు అడ్డుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం నాగేపెల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకు నిరసన సెగ తగిలింది.మాకు డబుల్ బెడ్ రూమ్ లు, దళిత బందు ఇవ్వలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో మా గ్రామాలు ముంపునకు గురైనప్పుడు , పంట పొలాలు మునిగిపోతే పట్టించుకోలేదని, కనీసం నష్టపరిహారం కూడా ఇప్పించలేదని ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని పుట్ట మధును గ్రామస్తులు,బ్యాక్ వాటర్ ముంపు బాధితులు నిలదీశారు.దీంతో పుట్ట మధు ఎన్నికల ప్రచారాన్ని ఆపి వెనుదిరిగాడు.