గన్నవరం ఎయిర్ పోర్ట్ లో రాహుల్ గాంధీకి ఘనస్వాగతం

విజయవాడ:- గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కి ఘనస్వాగతం లభించింది. తెలంగాణా రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం కోసం రాహుల్ గాంధీ గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఆయనకు ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు శాలువా కప్పి స్వాగతించారు.

ఈ కార్యక్రమములో కేంద్ర మాజీ మంత్రి జే.డి. శీలం , కార్యనిర్వాహక అధ్యక్షులుమస్తాన్ వలి , సుంకర పద్మశ్రీ గారు రాహుల్ గాంధీ గారిని కలిసిన వారిలో ఉన్నారు. అనంతరం షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక హెలికాఫ్టర్ లో తెలంగాణా రాష్ట్రానికి బయలుదేరి వెళ్లారు.