టెక్కలి నుండి కుప్పం వరకు తెలుగుదేశం కార్మిక చైతన్య యాత్ర

TNTUC అధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘు రామరాజు సారథ్యంలో ఈ నెల 6వ తేదీన నుంచి టెక్కలి నుండి కుప్పం వరకు చేపట్టనున్న కార్మిక చైతన్య యాత్ర గోడ పత్రికను తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి చేతుల మీదగా ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెడ్డి అధికారం లోకి వచ్చిన దగ్గర నుంచి కార్మిక వర్గాలన్ని ఇబ్బందులు పడుతున్నారు. 2014 నుండి 2019 వరకు కార్మికులు ఎంతో సంతోషంగా గడిపారు. టెక్కలి నుండి ప్రారంభం అయ్యే యాత్ర లో ప్రతి నియోజక వర్గం లో కార్మికులను కలిసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు కార్మికులు ఎంత ఆనందంగా వున్నారో గుర్తు చెయ్యాలి అని అన్నారు.

అలాగే సైకో రెడ్డి అధికారం లోకి వచ్చిన తరువాత కార్మికులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి వివరించండి అలాగే రేపు 2024 లో గెలిచిన తరువాత కార్మికులకు అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి యువ గళం పాదయాత్ర లో లోకేష్ గారు ఇచ్చిన హామీలను మా నాయకులు కార్మికులకు వివరించి వారిలో చైతన్యం తీసుకు రావడం కోసం ఈ కార్మిక చైతన్య యాత్ర చేపట్టడం జరుగుతుంది

ఈ కార్యక్రమంలో టి యన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘు రామరాజు, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారు, కొల్లు రవీంద్ర గారు, ఎమ్మెల్సీ అశోక బాబు గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వర రావు గారు టి యన్ టి యు సి రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్, సబ్బతి ఫణిశ్వర రావు, ప్రధాన కార్యదర్శి లు రెంటపల్లి శ్యామ్, మహంకాళి నరసింహారావు, మెకర అధిబాబు, గుంటూరు పార్లమెంటు అద్యక్షులు దొంతా నాగ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.