మరో ప్రజా ఉద్యమానికి  ఊపిరి పోయనున్న భారత్ న్యాయ్ యాత్ర

దేశవ్యాప్తంగా ప్రజలను  ఉత్తేజం చేయడమే లక్ష్యంగా రాహుల్‌గాంధీ  మణిపూర్ నుండి ముంబయి వరకు  భారత్‌ న్యాయ్  యాత్ర   జనవరి 14 నుంచి ప్రారంభించారు .   సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేయడం, సామాజిక న్యాయం   రాజ్యాంగ విలువలు బలోపేతం చేయడానికి కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టి  దేశ ప్రజల మన్ననలు పొందింది.
ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజల బ్రతుకులు చిన్నాభిన్నమై పోయాయి.  క్లిష్ట పరిస్థితుల్లో దేశ  ప్రజల భద్రతకు భరోసా లేకుండా పోయింది.  లౌకిక ప్రజాతంత్ర వాదులు, ప్రజా సంఘాలు స్వచ్చందంగా పాల్గొన్నారు.  కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జనవరి 14న మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ న్యాయ్ యాత్రను ప్రారంభించనున్నారు.  భారత్ జోడో యాత్ర సందర్భంగా, ఇతర  పార్టీలకు చెందిన పలువురు నాయకులు రాహుల్  గాంధీతో కలిసి వచ్చారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని యాత్ర ప్రభావితం చేస్తుంది.  రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర  రెండవ దశ 2024 కీలకమైన ఎన్నికల సంవత్సరంలో జరుగుతుంది,  కొన్ని కీలక మార్పులతో. పేరు మార్చబడిన భారత్ న్యాయ్ యాత్ర ఎక్కువ దూరాన్ని కవర్ చేస్తుంది, మరిన్ని రాష్ట్రాలను చుట్టుముడుతుంది భారత్ జోడో యాత్ర తో  పోలిస్తే కొద్దిగా సవరించిన ఆకృతిని అవలంబిస్తుంది.
 అసెంబ్లీ ఎన్నికలలో ఇటీవలి పరాజయాల తరువాత, హిమాచల్ ప్రదేశ్ మరియు కర్ణాటకలలో బిజెపిని ఓడించిన తరువాత పొందిన మానసిక ప్రయోజనాన్ని కాంగ్రెస్ కోల్పోతుందని గ్రహించింది. పార్టీ కార్యకర్తల్లో నైతిక స్థైర్యం తక్కువగా ఉందని, 2024లో గెలవడం సులభం కాదన్న  భావన పార్టీలో నెలకొంది. మారథాన్ యాత్ర అనేది పార్టీకి   అవసరమైన ఆక్సిజన్‌ను అందించడం,  క్యాడర్‌ను చురుకుగా ఉంచడం.   ఈ యాత్ర  రాహుల్ గాంధీ చిత్రాన్ని రీబూట్ చేస్తోంది.  రాహుల్ గాంధీ యొక్క అత్యంత విజయవంతమైన ఔట్రీచ్‌గా ఆవిర్భవించింది.
బిజెపిచే ఎగతాళి చేసిన ‘యువరాజ్’ వ్యక్తిత్వం నుండి అతని ఇమేజ్‌ని కష్టపడి పనిచేసే, సరళమైన అందుబాటులో ఉండే రాజకీయవేత్తగా మార్చింది. గత యాత్ర  నుంచి గణనీయమైన పాఠాలు నేర్చుకొని ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని తిరుగులేని నాయకుడిగా రూపాంతరం చెందారు.  రాహుల్‌ని రీబూట్ చేయడానికి  బిఎన్వై  సమర్థవంతంగా పని చేయగలదని పార్టీ విశ్వసిస్తోంది.
  80 ఏళ్ల క్రితం మహాత్మా గాంధీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది.  ఐదేళ్ల తర్వాత ఈ ఉద్యమం భారతదేశానికి స్వాతంత్య్రానికి దారితీసింది. భారతదేశం అంతటా ఐక్యతా సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మరియు స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క మొదటి పాన్-ఇండియన్ మార్చ్‌ను గుర్తించడానికి ఉద్దేశించిన ప్రతిష్టాత్మక యాత్ర.
లౌకిక ప్రజాతంత్ర వాదులు  మాత్రమే భారతదేశాన్ని రక్షించగలరు. మతోన్మాద  బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను గద్దె దింపడానికి, అవకాశవాద పార్టీలను ఎండగట్టడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ యాత్రకు ప్రధాన భూమిక పోషించినా  ప్రజా సంఘాల నేతలు స్వచ్చందంగా పాల్గొంటున్నారు. పౌర సమాజ సంస్థ నాయకులు, స్వరాజ్ అభియాన్ పార్టీ, కవులు, కళాకారులు,  మేధావులు, మూడు వందలకు  పైగా పౌర సమాజ సంస్థలు స్వచ్చంధ సంస్థలు ఇందులో భాగస్వామ్యం కావడం ఆలాగే  మీడియా ప్రతినిధులు, రిటైర్డు  ఐఏఎస్, ఐపిఎస్ ఆఫీసర్లు మరియు శాస్త్రవేత్తలు  ఈ యాత్రలో పాల్గొంటున్నారు.
ఇందులో భాగంగా దేశంలోని 14 రాష్ట్రాలు, 85 జిల్లాల గుండా ఏకంగా 6200 కిలోమీటర్ల పొడవునా ఈ యాత్ర దిగ్విజయంగా కొనసాగనుంది. ‘కలిసి నడుద్దాం, దేశాన్ని కలిపి ఉంచుదాం (మిలే కదమ్‌.. జుడే వతన్‌)’  నినాదంతో సుదీర్ఘంగా 70 రోజుల పాటు ఈ ప్రజా ఉద్యమం ముందుకు కొనసాగుతుంది.  దేశప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా  భారత్‌ న్యాయ్  యాత్ర కొనసాగుతుందని అన్నారు రాహుల్‌గాంధీ. ఈడీ, సీబీఐ దాడులతో, ప్రజలచే  ఎన్నికైన పార్లమెంటు సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసి   విపక్షాలను బెదిరిస్తే ఎవరు భయపడరని అన్నారు.
  నిరుద్యోగం, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల,  రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం, రాజకీయ నాయకులపై ఇడి, సీబీఐ కేసులు పెట్టడం,  ఉపాధి అవకాశాలు నీరుగార్చడం,  కవులు కళాకారులు మేధావులపై దేశ ద్రోహ కేసులు బనాయించడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం,  విద్య వైద్యం వ్యవసాయం నైతికత మానవ విలువలు మహిళా సాధికారత దళితులు, మైనార్టీలు  అన్ని రంగాలు పతనం చెంది నీచ స్థితికి దిగజారాయి.
ఇలాంటి సందర్భంలో దేశంలో  ఏకధృవ సామాజిక పోకడ, దేశంలో నెలకొన్న ఆర్థిక అసమానతలు, విద్వేషాలను రూపుమాపేందుకు దేశ ప్రజలు నడుం బిగించాలి. కులమతాలకతీతంగా దేశ ప్రజానీకం పాదయాత్రలో కదంతొక్కనున్నారు. పాదయాత్రగా కొనసాగే ఈ కార్యక్రమాన్ని స్వాతంత్య్ర భారతంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ఉద్యమం స్థాయికి తీసుకెళ్లాలని పార్టీ భావిస్తోంది.