అర్థం లేని అశాంతిని భోగి మంటల్లో వదిలేయండి

ఈ ప్రపంచంలో, మనిషికీ-మనిషికీ మధ్య ఉన్న, నిజమైన అడ్డుగోడలు అయిన అనుమానాలు, అపనమ్మకాలు, అపోహలు, అసూయలు, ఈర్ష్యలు, ద్వేషాలు, విద్వేషాలు, భయాలు, జెలసీలు, నిరాశా-నిస్పృహలు, ప్రతీదీ పక్కవారితో పోల్చుకోవడాలు, పనికిమాలిన కంపారిజన్లు, అర్థంలేని అశాంతులు, తోటివాళ్లు-పక్కవాళ్లు-పొరుగువాళ్ళు పచ్చగాఉంటే వచ్చే కడుపులో మంటలు-ఎసిడిటీలు, అన్నీ-ఉన్నా, ‘ఏదో-లేదు’ అనుకుంటూ అనుక్షణం బాధ పడే అపరిమిత దుఃఖాలు-శోకాలు-ఆవేదనలు…ఎక్స్ఎట్రాలు వంటివి ఏ కొంచెమైనా, ఏ మాత్రమైనా, లవలేశమైనా, మీకు గానీ ఉంటే, వాటన్నింటినీ కట్టగట్టి-మూటకట్టి ఈ రోజే, పవిత్రమైన “భోగి” మంటల్లో వేసి-కాల్చేసి-దహనం చేసేయండి ప్లీజ్!

 భోగ-భాగ్యాలతో కాకపోయినా, మీరు ఎల్లప్పుడూ నిండు మనఃశాంతితో, అంతులేని అనందంతో, చక్కటి ఆరోగ్యంతో, ఉల్లాసంగా-ఉత్సాహంగా, సదా-సర్వదా, సుఖ-సంతోషాలతో ఉండటానికి ఇవే మీకున్న ప్రధాన అవరోధాలు+ఆటంకాలు! లేకపోతే “ఇవన్నీ”, మిమ్మల్ని బతికుండగానే, సంపూర్ణంగా కాల్చేసి, నిండు ప్రాణాలతోనే మిమ్మల్ని సజీవ దహనం చేసేస్తాయి…! దయచేసి జాగ్రత్త…”భోగి” పండుగ అసలైన అర్థం, అంతరార్థం, పరమార్థం ఇదే…
భోగి పండుగ శుభాకాంక్షలతో…
                                                  – టీం మహానాడు