పెట్టుబడులు, పరిశ్రమలను రప్పించడం…కాంట్రాక్టర్ పీకపై కత్తిపెట్టి బెదిరించినంత ఈజీ కాదు
-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎద్దేవా
గత ఏడాది మార్చిలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ “రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉంది” అని చెప్పడం, ఆ తర్వాత కోడిగుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ రూ.13.12 లక్షల కోట్లు విలువైన ఒప్పందాలు చేసుకున్నామని చెప్పడంతో ఆశ్చర్యపోయాను.
ఇదే విషయాన్ని అబద్ధాలు, అవాస్తవాల ప్రచారంలో గోబెల్స్ ను తలదన్నే విషపుత్రిక సాక్షిలో తాటికాయంత అక్షరాలతో కూడా రాశారు. ఏడాదైనా మంత్రిగారు చెప్పిన కోడిగుడ్లు పొదగలేదు, ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. జె-ట్యాక్స్ బెడద భరించలేక జాకీ, లులూ, జాకీ వంటి ఎన్నో ప్రఖ్యాత పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి పరారైన విషయం తెలుసుకున్న పారిశ్రామికవేత్తలు ముఖం చాటేశారు.

అనంతపురం జిల్లాలో వేలాది మహిళలకు ఉపాధి కల్పించే అవకాశమున్న జాకీ పరిశ్రమను తరిమేసిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి… తాజాగా కాసుల కోసం ఓ కాంట్రాక్టర్ వద్ద పనిచేసే 11మంది కూలీలను నిర్బంధిస్తే పశ్చిమ బెంగాల్ ఎంపి కలెక్టర్, ఎస్పీకి లేఖ రాయడం రాష్ట్రానికే సిగ్గుచేటు. ఇటువంటి ప్రజాప్రతినిధులున్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ పరిశ్రమదారుడైనా ధైర్యం చేస్తాడా?! పెట్టుబడులు తేవడం కమీషన్ల కోసం కాంట్రాక్టర్ పీకపై కత్తిపెట్టి బెదిరించినంత ఈజీ కాదు జగన్మోహన్ రెడ్డీ!