స్వచ్చ అభియాన్ లో చురుగ్గా పాల్గొనండి – బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు  పురందేశ్వరి

– ఎన్నికల సమయం ఆసన్నమైంది … పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నం అవుదాం

-స్వచ్చ అభియాన్ లో చురుగ్గా పాల్గొనండి

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు  పురందేశ్వరి  పిలుపు

 

విజయవాడ… దేవాలయాలు పరిశుభ్రత కార్యక్రమంలో  బిజెపి శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని  బిజెపి శ్రేణులకు  బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు   దగ్గుబాటి పురందేశ్వరి  పిలుపునిచ్చారు.
మండల ఆ పై స్ధాయి నాయకులతో  బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు   దగ్గుబాటి పురందేశ్వరి  ఆడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు.
స్వచ్చ అభియాన్ పేరుతో   ఈ కార్యక్రమం నిర్వహించేందుకు గ్రామస్దాయిలో కార్యకర్తలు స్ధానిక దేవాలయాలకు సంబందించిన కమిటీలను సమన్వయం చేసుకుని  స్వచ్చఅభియాన్ నిర్వహించాలన్నారు.
ఆయా దేవాలయాల పరిధిలో  భక్తులను కూడా  ఈ కార్యక్రమంలో  భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు భోగి రోజు నుండి ప్రారంభమై 22 వ తేదీ వరకు  కొనసాగించాలన్నారు.
భారతీయ జనతా పార్టీని కేంద్రంలో  మూడవ సారి,  ఆంధ్రప్రదేశ్ లో  ఒక్క సారి అవకాశం ఇవ్వాలంటూ వాల్ రైటింగ్ ను  ప్రతి పోలింగ్ బూత్ వద్ద ప్రారంభించాలని పురందేశ్వరి పిలుపు నిచ్చారు.
 ఈ కార్యక్రమాన్ని  15వ తేదీన ఢిల్లీలో  జాతీయ అధ్యక్షులు  జెపి నడ్డాగారు ప్రారంభిస్తారు అదేరోజు రాష్ట్ర వ్యాప్తంగా  అన్ని జిల్లాల్లొ  వాల్ రైటింగ్ ను ప్రారంభించాల్సి ఉంటుందని  ఆడియో కాన్ఫెరెన్స్ లో  పురందేశ్వరి వివరించారు.
 సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న దశలో పార్టీ కార్యక్రమాలు పోలింగ్ బూత్ స్ధాయిలో  ప్రభావంతంగా చేయడం ద్వారా  ఓటర్లు కు దగ్గర అవ్వాలని బిజెపి శ్రేణులకు  ఈ సందర్భంగా సూచించారు.
 సంక్రాంతి పండుగ  సందర్భంగా  గ్రామాల్లొ బంధుమిత్రులతో  పండుగ అంగరంగ వైభంగా ఏవిధంగా నిర్వహించుకుంటున్నామో అదే ఉత్సాహంతొ ఈ రెండు కార్యక్రమాలను తప్పకుండా  విజయవంతం చేయాలన్నారు.