రష్మిక మందన్న జపాన్ కు వెళ్లిన విషయం తెల్సిందే. ధనుష్ సినిమా షూటింగ్ మధ్య లో ఆపేసి మరీ జపాన్ లో జరుగుతున్న క్రంచీరోల్ అనిమే అవార్డ్స్ 2024 లో పాల్గొనేందుకు రష్మిక మందన్న వెళ్లింది. అక్కడ నుంచి రష్మిక తెగ సందడి చేస్తూ ఫోటో షూట్స్ ఇస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం రష్మిక మందన్న షేర్ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అవుతున్నాయి. క్లీ వేజ్ షో తో రష్మిక జపనీస్ లుక్ లో ఫోటోలను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందమైన జపాన్ అందాలను ఆస్వాదిస్తున్నట్లు ఈ ఫోటోలు షేర్ చేసింది రష్మిక. చేతిలో అరడజను సినిమాలు పెట్టుకుని రష్మిక ఇలా జపాన్ వెళ్లి చిల్ అవ్వడం ఏంటి అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అక్కడి అవార్డు వేడుక పూర్తి అయిన వెంటనే రష్మిక ఇండియాకి వచ్చి వెంటనే ధనుష్ తో షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక రష్మిక మందన్న మరో వైపు పుష్ప 2 ఇంకా రెండు మూడు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. అంతే కాకుండా హిందీ సినిమాలకు కూడా రష్మిక మందన్న తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.