సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. మార్చి 15న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు నవీన్ రెడ్డి మీడియాతో తన సినీ జర్నీ గురించి విశేషాలను పంచుకున్నారు…
*మాది కృష్ణాజిల్లా దగ్గర నూజివీడు. మా బంధువులు కృష్ణాజిల్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు. అలా నాకు సినిమా ఇండస్ట్రీతో అనుబంధం ఉంది. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేసిన తర్వాత సతీష్ వేగేశ్నగారి దగ్గర దర్శకత్వ శాఖలో వర్క్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ‘వెయ్ దరువెయ్’ చిత్రంతో దర్శకుడిగా మారాను.
* నాకు తెలిసిన వాళ్ల ద్వారా నిర్మాత దేవరాజ్ పోతూరుగారితో పరిచయం ఏర్పడింది. కథ వినగానే ఆయనకు నచ్చటంతో సినిమా చేయటానికి అంగీకరించారు. సినిమాను కేవలం 35 రోజుల్లోనే పూర్తి చేశాం. అంత త్వరగా పూర్తి చేయటానికి కారణం ప్రీ ప్రొడక్షన్‌పై ఎక్కువగా పని చేయటమే. మూడు నాలుగు నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్ చేసుకోవటం వల్ల షూటింగ్ చాలా సులభంగా ఎలాంటి టెన్షన్ లేకుండా పూర్తి చేశాం.
* దర్శకుడిగా ‘వెయ్ దరువెయ్’ తొలి చిత్రమే అయినప్పటికీ ఎలాంటి ప్రెషర్ ఫీల్ కాలేదు. అందుకు కారణం నిర్మాత దేవరాజ్‌గారు, హీరో సాయిరామ్ శంకర్ సహా ఎంటైర్ టీమ్ అందించిన సపోర్ట్ అనే చెప్పాలి. సాయిరామ్ శంకర్‌ను హీరోగా అనుకుని పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్‌తో కలిశాం. సాయిరామ్ శంకర్‌గారైతే నా కథలోని హీరో బాడీ లాంగ్వేజ్‌కి సూట్ అవుతారనిపించింది. అందుకనే ఆయన్ని అప్రోచ్ అయ్యాం.
* కామారెడ్డి ప్రాంతంలో ఉండే హీరోకి ఓ సమస్య వస్తుంది. దాని పరిష్కారానికి హీరో ఏం చేశాడు.. ఎందుకు హైదరాబాద్ వచ్చాడు.. సమస్యను ఎలా పరిష్కరించుకున్నాడనేదే మా సినిమా మెయిన్ కథాంశం. సినిమా చిన్న సెంటిమెంట్‌తో ప్రారంభం అవుతుంది. అందరికీ కనెక్ట్ అయ్యే కొన్ని నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని సినిమాను తెరకెక్కించాం. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా సినిమాను తెరకెక్కించాం. యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది.
* సినిమాలో ఎంటర్టైన్మెంట్ మెయిన్ హైలైట్. మేం అనుకున్న పాయింట్‌ను సీరియస్‌గానూ చెప్పొచ్చు. కానీ నేను ఎంటర్టైనింగ్గానే చెప్పాలనుకున్నాను. భీమ్స్‌గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అలాగే మంచి సీనియర్ ఆర్టిస్టులు నటించారు. హీరోయిన్స్ యషా శివకుమార్, హెబ్బా పటేల్ కు మంచి ప్రాధాన్యత ఉంటుంది. కథలో భాగంగా వారి పాత్రలు ట్రావెల్ అవుతాయి.
* ‘వెయ్ దరువెయ్’ దర్శకుడిగా నాకు మంచి ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. సినిమా ఫస్ట్ కాపీ చూసి నిర్మాతగారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. రెండున్నర గంటల పక్కా ఎంటర్టైనర్.
* నెక్ట్స్ సినిమా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. డిస్కషన్స్ జరుగుతున్నాయి