ఇటీవలే హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఎఫ్ ఎన్ సి సి క్లబ్ లో ఆల్ ఇండియన్ బ్రిడ్జి 12వ టోర్నమెంట్ సందర్భంగా శంకర్ జైకిషన్ మధుర గీతాలను తలుచుకుంటూ ఓక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎఫ్ ఎన్ సి సి ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు గారు, వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగారావు గారు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ గారు, జాయింట్ సెక్రెటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు గారు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి గారు, మెంబర్స్ కాజా సూర్యనారాయణ గారు, బాలరాజు గారు, ఏడిద సతీష్ (రాజా) గారు, వరప్రసాద రావు గారు, సామా ఇంద్రపాల్ రెడ్డి గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ కే. ఎల్. నారాయణ గారు, డైరెక్టర్ బి. గోపాల్ గారు, కల్చరల్ కమిటీ చైర్మన్ తమ్మిరెడ్డి భరద్వాజ్ గారు, శంకర్ జైకిషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజర్ లక్ష్మి గారు, లక్ష్మి నారాయణ గారు, గురువారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. శంకర్ జైకిషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజర్ లక్ష్మి గారు మాట్లాడుతూ : ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ వారికి ఇంత అందమైన వేదిక ఇచ్చి ఈ కార్యక్రమం జరగడానికి సాయం చేసినందుకు ధన్యవాదాలు. శంకర్ జైకిషన్ అభిమాన సంగం 2014 లో స్థాపించడం జరిగింది. కారణం నేటి సినిమా పాటలలో మెలోడీ పాటలు తగ్గిపోయాయి. పాత రోజుల్లో పాటలు ఎంత మధురంగా ఉండేవో నేటి యువతకి తెలిసేలా చేయాలి. గోల్డెన్ ఎరా లో అన్ని పాటలు బావుండేవి, అందరూ బాగా చేసే వారు. వారిలో ఒకరైన శంకర్ జైకిషన్ పేరు పెట్టుకున్నాము. ఈ ఆర్గనైజేషన్ ద్వారా ప్రజలకు వైద్య సాయం చేయడం లాంటి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నాము. భారత దేశం లో ఓ యుద్ధ సమయంలో ఇందిరా గాంధీ గారు ఫండ్స్ అడిగినప్పుడు మొదటిగా శంకర్ జైకిషన్ గారు ముందుకు వచ్చారు. అందుకే ఆయన అంటే మాకు అభిమానం. అదేవిధంగా ఎంతోమందికి ఆపరేషన్ల కోసం సహాయం చేశారు. ఆలా ఆయన గురించి చెప్పాలి అంటే ఎన్నో ఉన్నాయి. అదే బాటలో మేము గతంలో కొన్ని కొంతమందికి సహాయం చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈశ్వర్ చంద్ర హాస్పిటల్స్ ద్వారా ప్లాస్టిక్ సర్జరీస్ ఆపరేషన్ కి సహాయం చేయాలనుకుంటున్నాం. ఒకపక్క మంచి మెలోడీ సాంగ్స్ అందిస్తూనే శంకర్ జై కిషన్ కష్టాల్లో ఉన్నవారికి పేదలకు చేసిన సహాయాన్ని కొనియాడారు. గురువారెడ్డి గారు చాలా మంచి వైద్యులు అంటూ ఆయన సేవలను మెచ్చుకున్నారు.