జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా ‘డియర్’. ఈ చిత్రానికి ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. నట్మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రా ప్రాంతంలో విడుదల చేయనుండగా, ఏషియన్ సినిమాస్ తెలంగాణలో విడుదల చేయనుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం తమిళంలో ఏప్రిల్ 11న, తెలుగులో ఏప్రిల్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. హీరో సందీప్ కిషన్, నిర్మాత నాగ వంశీ, దర్శకులు వెంకీ అట్లూరి, నందిని రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరైన ఈ వేడుకు చాలా గ్రాండ్ గా జరిగింది. హీరో జివి ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ..మా ట్రైలర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరో నాగచైతన్య గారికి థాంక్స్. ఈ వేడుకు విచ్చేసిన మాకు సపోర్ట్ చేసిన సందీప్ కిషన్, వంశీ, వెంకీ, నందిని గారికి ధన్యవాదాలు. డియర్ అందరూ రిలేట్ చేసుకునే సినిమా. ప్రతి సీన్ రియల్ లైఫ్ తో రిలేట్ చేసుకునేలా వుంటుంది. మంచి ఎమోషన్స్ వుంటాయి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఐశ్వర్యనే ఈ కథ నా దగ్గరకి తీసుకొచ్చారు. కథ వినగానే చాలా నచ్చింది. దర్శకుడు ఆనంద్ మంచి కథని చక్కగా తీశారు. ‘రాజా రాణి’ కథ వినప్పుడు ఎలాంటి స్పార్క్ వచ్చిందో ఈ కథ విన్నప్పుడు అలాంటి అనుభూతి కలిగింది. తప్పకుండా ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేసేలా వుంటుంది’ అన్నారు.