ఘనంగా ‘తెప్పసముద్రం’ ప్రీరిలీజ్

బిగ్ బాస్ ఫేం అర్జున్ అంబటి హీరోగా, కిశోరి దాత్రక్ హీరోయిన్‌గా రవిశంకర్, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పి. ఆర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందు రాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెప్పసముద్రం సినిమాలోని మొటది పాటను లాంచ్ చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి రెండో పాటను లాంచ్ చేశారు. ఇక ట్రైలర్‌ను జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో… నిర్మాత మహేంద్రనాథ్ మాట్లాడుతూ..‘‘ఇదొక మంచి సోషల్ పాయింట్ మీద తీసిన సినిమా. ఇలాంటి సినిమాలు బాగా ఆడాలి. అప్పుడే మంచి సినిమాలు మరో పది వస్తాయి. అందరూ తప్పకుండా ఈ సినిమాను చూడండి’’ అని చెప్పారు. చిత్ర నిర్మాత రాఘవేంద్రగౌడ్ మాట్లాడుతూ..‘‘నేను కొత్త నిర్మాతననే భావన లేకుండా ఇక్కడున్న ప్రతిఒక్కరూ నాకు ఎంతగానో సహకరించారు. వాళ్లందరికీ నా ధన్యవాదాలు. చైతన్యగారిని మా ఇంటికి ఆహ్వానించినప్పుడు ఈ సినిమా డిస్కన్ జరిగింది. అలా ఈ సినిమా ప్రారంభమైంది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అతిథులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఒక సినిమా రెడీ అవ్వాలంటే ఎంతోమంది కష్టపడాలి. డైరెక్టర్ గారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారికి అభిమానిని. అలాంటి వాళ్ల స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చాను. రవిశంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా ప్రతిఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఈ నెల 19న అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు.