పరదాలెందుకు కట్టారు? అధికారులపై చంద్రబాబు ఫైర్..

నిన్న ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అయితే గత సీఎం పర్యటనకు కట్టినట్లే మళ్లీ దారి వెంట అధికారులు చంద్రబాబు పర్యటనకు సైతం పరదాలు కట్టారు. తన పర్యటనల్లో పరదాలు, అనవసరపు ఆంక్షలకు దూరంగా ఉండాలని అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి: నిన్న ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అయితే గత సీఎం పర్యటనకు కట్టినట్లే మళ్లీ దారి వెంట అధికారులు చంద్రబాబు పర్యటనకు సైతం పరదాలు కట్టారు. తన పర్యటనల్లో పరదాలు, అనవసరపు ఆంక్షలకు దూరంగా ఉండాలని అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పద్ధతులు వీడాలని స్పష్టంగా చెప్పారు. సీఎంను ప్రజలకు దూరం చేసేలా ఎటువంటి చర్యలు చేపట్టవద్దని చంద్రబాబు చెప్పారు.

సీఎం ఆదేశాల మేరకు తిరుమల కొండపై అధికారులు కట్టిన పరదాలను అప్పటి కప్పుడే తొలగించడం జరిగింది. పాత ప్రభుత్వ వాసనలు వీడాలని అధికారులకు సీఎంవో నుంచి ఆదేశాలు అందాయి. మార్పు కనిపించాలనే విషయంలో ఇప్పటికే సీఎం పలుమార్లు స్పష్టంగా చెప్పారని… ఆదేశాలను వెంటనే అమలు చేయాలని అధికారులకు సీఎంవో ఆదేశాలు జారీ చేసింది. నిన్న మంత్రి నారా లోకేష్ సైతం ఇదే విషయమై అధికారులను హెచ్చరించారు.