AP Rains: హెచ్చరిక.. ఆంధ్రాలోని ఈ జిల్లాలకు పిడుగులు పడే ఛాన్స్.. ఇకపై విస్తారంగా వర్షాలే

నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జోరున వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 13న, గురువారం.. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి

మోస్తరు వర్షాలు..
నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జోరున వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 13న, గురువారం.. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయంది.

ఇక జూన్ 14న, శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగానూ రుతుపవనాలు పూర్తిగా విస్తారించాయన్నారు. అలాగే ఎన్లినో.. లెనినోగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. అటు హైదరాబాద్ నగరానికి కూడా భారీ వర్ష సూచన అలెర్ట్ ఇచ్చింది. నగర పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.