సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన రాజధాని రైతులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసం నుంచి వెలగపూడి సచివాలయానికి బయల్దేరిన చంద్రబాబుకు సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌లో దారి పొడవునా పూలు చల్లి అఖండ స్వాగతం పలికారు. అమరావతికి మళ్లీ మంచి రోజులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. క్రేన్‌ సాయంతో భారీ గజమాల వేసి తమ అభిమానం చాటుకున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు భారీగా తరలివచ్చారు. దారి పొడవునా రైతులకు అభివాదం చేస్తూ సీఎం ముందుకు సాగారు.