బాధ్యతల స్వీకారానికి సెక్రటేరియట్‌కి బయల్దేరిన ఏపీ సీఎం చంద్రబాబుకి , దారి పొడవునా పూలు పరిచి స్వాగతం పలికారు రాజధాని రైతులు. దారిలో తన కోసం ఎదురు చూసిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు చంద్రబాబు. చంద్రబాబుకి, సెక్రటేరియట్‌లో సీఎస్‌తో పాటు ఉన్నతోద్యోగులు ఘన స్వాగతం పలికారు. ఏపీ సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్‌లతో సహా మొత్తం ఐదు సంతకాలు చేశారు.