శ్రీ వెంకటేశ్వర స్వామికి విశేష పూజలు

మంగళగిరి, మహానాడు: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఆదివారం మంగళగిరి నియోజకవర్గంలో రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో విశేష పూజలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.