– ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కారు కూడా
జూనియర్ఎ న్టీఆర్ కారుకున్న బ్లాక్‌ఫిల్మ్‌ను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముత్త ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద రెండో రోజూ వాహనాలను తనిఖీ చేశారు. బ్లాక్‌ఫిల్మ్, నలుపు తెరలు ఉన్న వాహనాలను గుర్తించి వాటిని తొలగించారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఎన్టీఆర్ కారును ఆపి బ్లాక్ తెరను తొలగించారు. ఆ సమయంలో కారులో ఎన్టీఆర్ కుమారుడు, మరొకరు ఉన్నారు.
ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్, మేరాజ్ హుస్సేన్, ఏపీకి చెందిన శ్రీధర్‌రెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్ ఉన్న వాహనాలను తొలగించారు. అలాగే, నంబరు ప్లేటు వాహనాలకు చలానాలు విధించారు. మొత్తం 90 వాహనాలపై కేసులు నమోదు చేశారు.