శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత..

శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. చాయ్‌ దుకాణం దగ్గర జరిగిన గొడవతో ఆలయ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. ఉగాది ఉత్సవాల్లో భాగంగా మల్లన్నను దర్శించుకోవడానికి కర్ణాటక భక్తులు శ్రీశైలానికి భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో ఓ కన్నడ భక్తుడు చాయ్‌ తాగేందుకు వెళ్లాడు. దుకాణ యజమానిని తాగడానికి నీళ్లు అడిగాడు. అయితే లేవని చెప్పడంతో ఆ భక్తుడు అతనితో గొడవకు దిగాడు. అది కాస్తా తీవ్రం కావడంతో టీ షాపు యజమాని కన్నడ భక్తుడిపై గొడ్డలితో దాడిచేశాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని దవాఖానకు తరలించారు.

ఇదంతా గమనిస్తున్న తోటి భక్తులు ఆలయ సరిసరాల్లోని షాపులను ధ్వంసం చేశారు. షాపుల్లో వస్తువులను చెల్లాచెదురుగా పడేశారు. కనిపించిన వాహనాలకు నిప్పుపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి చేరుకున్నారు. శ్రీశైలం వీధుల్లో పెద్దసంఖ్యలో పోలీసును మోహరించారు. గొడవను అదుపులోకి తీసుకొచ్చారు.దుకాణాలపై దాడులతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, గాయపడిన వ్యక్తిని పరామర్శించిన జగద్గురు పీఠాధిపతి.