జిల్లా కలెక్టర్ పేరిట ఫేక్ వాట్సాప్ గ్రూప్

– రూ. 2.40 లక్షలు వసూలు

నారాయణపేట: సైబర్ నేరగాళ్లు తమ తెలివితేటలను ఉపయోగించి అమాయక ప్రజలనే కాదు ఉన్నత అధికారులను సైతం మోసం చేస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలు చేయడంలో కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇటీవల ఒక నేరగాడు ఏకంగా నారాయణపేట జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన పేరిట వాట్సాప్ గ్రూపు తయారు చేశాడు. ఫోటో, ప్రొఫైల్ సూచించి అమెజాన్ పే ఆప్ నుండి రెండు లక్షల నలభై వేల రూపాయలు వసూలు చేసినట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దృష్టికి వెళ్లింది.

ఈ విషయంపై ఆరా తీయగా నిజమే అని గుర్తించి ఆమె వెంటనే జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించింది. ఈ విషయంపై విచారణ జరిపిన ఎస్పీ ఈ నేరానికి పాల్పడినది జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగిందని ఆయన చెప్పారు. ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే ఎన్ సీఆర్పీ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని, లేనియెడల 1930 నెంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ వెంకటేశ్వర్లు కోరారు.