శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆదివారం భారీగా బంగారం పట్టుబడింది.దోహా ప్రయాణీకుల వద్ద 89 లక్షల 74 వేల రూపాయల విలువ చేసే 1630 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.కేటుగాళ్లు బంగారాన్ని పేస్టుగా మార్చి పొట్టలో దాచారని తెలిపారు.ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు ప్రయాణీకులపై అనుమానం కలగడంతో అదుపులోకి తీసుకున్నామని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు చెప్పారు.