గోవా టూర్‌కు వచ్చిన ఓ విదేశీ మహిళపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోవా బీచ్‌లోనే కామాంధుడుకు ఆత్యాచారానికి పాల్పడ్డాడు. ఉత్తర గోవాలోని అరాంబోల్ బీచ్ సమీపంలోని ప్రసిద్ధ స్వీట్ లేక్ వద్ద బ్రిటిష్ మహిళపై అత్యాచారం జరిగింది. బ్రిటన్‌కు చెందిన బాధితురాలు తన భర్తతో కలిసి గోవా పర్యటనకు వచ్చింది. మధ్య వయస్కురాలైన ఆ మహిళ అరాంబోల్ బీచ్ సమీపంలోని ప్రసిద్ధ స్వీట్ లేక్ వద్ద జూన్ 2న విశ్రాంతి తీసుకుంటోంది. ఈ క్రమంలో గోవాకు చెందిన 32 ఏళ్ల జోయెల్ విన్సెంట్ డిసౌజా ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు గోవా పోలీసులు చెప్పారు.
ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు చెప్పిన వివరాలు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు జోయెల్ విన్సెంట్ డిసౌజా (32)ను అరెస్ట్ చేశారు. అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్టు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని గోవా పోలీసు అధికారి తెలిపారు. నిందితుడు జోయెల్ స్థానికుడేనని పోలీసులు తెలిపారు. దర్యాప్తు తర్వాత కేసు గురించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
గురువారం స్వీట్ లేక్ వద్ద దంపతులు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నిందితుడు జోయెల్ అక్కడకు వెళ్లి తాను మసాజ్ చేస్తానని చెప్పాడు. ఈ సమయంలో బ్రిటిష్ మహిళ భర్త.. తన భార్యకు ముల్తానీ మట్టితో మసాజ్ చేయాలని కోరినట్టు తెలుస్తోంది. దీనిని అవకాశంగా తీసుకుని ఆమెకు మసాజ్ చేస్తున్నట్టు నటించి అత్యాచారం చేశాడు.