ఎన్ని పాత్రలు వేసినా
తెలుగు సినిమా చెల్లి..
ఓ అన్నా..నీ అనురాగం
ఎన్నో జన్మల పుణ్యఫలం..
చెల్లిగా అంతటి గుర్తింపు రావడం చంద్రకళ పూజాఫలం..!
సిరిమల్లె సొగసు
జాబిల్లి వెలుగు
నీలోనె చూసానులే..
పుట్టినిల్లు..మెట్టినిల్లులో..
ఇన్స్పెక్టర్ భార్యగా
కృష్ణతో నటించినా..
శ్రీరామనామాలు శతకోటి
ఒక్కొక్క పేరు బహుతీపి..
అనే మీనాలో చెల్లి..
చంద్రకళ కల్పవల్లి..
దొరబాబు కంటి జాబిల్లి!
దసరాబుల్లోడు అక్కినేనిని
నల్లవాడే అమ్మమ్మో
అల్లరి పిల్లవాడే..
ఇలా ఆట పట్టించిన మరదలు..
క్యాన్సర్ వచ్చేపాటికి
వాడు నీవాడే..
అంటూ తప్పుకుంది..
ఇలా సినిమా జీవితం
సాగింది త్యాగాలతో..
నిజ జీవితమూ
ముగిసింది అదే క్యాన్సర్ తో!
చంద్రకళ వర్ధంతి..
సురేష్ కుమార్