బట్టలతో బుట్టలో వేశాడు

మల్లికార్జునరావు పీలా..
ఇలా అంటే
గురుతు పట్టడం ఎలా…
బట్టల సత్యం..
నవ్వుల ముత్యం..
మరో స్వాతిముత్యం..
ఇదీ ముద్ర..
350 సినిమాల రాజముద్ర!

లెక్కకు తెచ్చిన చిక్కులు..
నాటకంతో నటనకు శ్రీకారం..
పలుకే బంగారమాయెనేతో
మంచి గుర్తింపు..
వెండి తెరపై
చిన్న వేషాలు కట్టినా
నవ్వుల అన్వేషణ ఫలించి
పులిరాజు పుట్టాడు..
బట్టల సత్యంగా మారాడు..
హలోబ్రదర్ అంటూ
కోటనే ముంచాడు..!
తను ప్రమోషన్ కొట్టినా
మిత్రుడు మరణిస్తే
వినోదం పక్కన పెట్టి
విషాదంలోనూ
అదరగొట్టేశాడు
మల్లికార్జునుడు..
మళ్లీ రాడు గాని
మర్చిపోలేని నవ్వులు
పంచి వెళ్ళాడు..!

సురేష్ కుమార్ ఇ
9948546286