-60 మంది అమ్మాయిల నుండి సుమారు 4కోట్ల రూపాయల మోసాలు..
-పిటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు..
రాజమండ్రి కి చెందిన జోగడ వంశీకృష్ణ.. బీటెక్ పూర్తి చేశాడు.ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిల పేరుతో ఫెక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నాడు.ఆ ఫెక్ అకౌంట్లతో తనను తాను హై ప్రొఫైల్ వ్యక్తి గా క్రియేట్ చేసుకుంటూ టార్గెట్ చేసిన అమ్మాయిల తో చాటింగ్.చాలా మంది అమ్మాయిలు ఇతగాడి ఫ్రెండ్షిప్ కోసం తపిస్తున్నట్లు బిల్డప్.
ఈ విధంగా 60 మంది అమ్మాయిలను మోసం చేసి సుమారు 4 కోట్ల రూపాయల మోసం.25 లక్షల రూపాయలు మోసపోయిన అమెరికా లో ఉండే హైదరాబాద్ కి చెందిన యువతి.హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసిన యువతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు.పిటి వారెంట్ పై అదువులోకి తీసుకొని రిమాండ్ తరలించిన పోలీసులు.
వంశీకృష్ణ పై గతంలో రాచకొండ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, జోగులాంబ గద్వాల్, నిజామాబాద్, ఖమ్మం, భీమవరం, వైజాగ్, కరీంనగర్, విజయవాడ లలో ఈ తరహా పలు కేసులు.