అభినేత్రి రాజశ్రీ
ఎన్టీఆర్..కాంతారావు..
ఇద్దరిలో ఎవరు కత్తిపట్టినా
పక్కన అదే స్త్రీ ..రాజశ్రీ..!
అందానికి అందం..
అభినయానికి అభినయం..
ఈ రెంటితో
పాత్రకు న్యాయం!
డాన్సు కట్టిందంటే
ఫ్యాన్స్ మోతే..
ఝుంఝుం గులాబీ
తుమ్మెద పాడింది..
చిట్టిచెల్లెలులో
అన్నగారితో గంతులు..
అది ఒక ఇదియే..
అతనికె తగులే..
ప్రేమించి చూడులో
ఓపలేని విరహం..
ఆకాశంలో హంసలమై..
హాయిగ ఎగిరే జంటలమై
అలా అలా కులాసాల
తేలిపోదామా
అక్కినేనితో విలాసం..
నన్ను ఎవరో తాకిరి
కన్నె మనసే దోచిరి..
చూపులోనే ఓపలేని
మత్తు మందు జల్లిరి..
శోభన్ బాబుతోనూ
ఓ డ్యూయెట్..
పాటలో అందంగా..
ఆటలో వయ్యారంగా..
జానపదాలు..సాంఘికాలు..
పౌరాణికాలు అన్నిటా రాజశ్రీ
చక్కని అభినయశ్రీ..
సురేష్ కుమార్ ఇ
9948546286