అక్కినేని ఫ్యామిలీలో ప్రేమపెళ్లిళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున, సుమంత్, తరువాత నాగచైతన్య, అఖిల్ వరకు అందరూ ప్రేమ వ్యవహారాలే. అవన్నీ మనకు తెలిసినవే. ఇకపోతే నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించి నాగచైతన్య వివాహ నిశ్చితార్దం ఈ రోజే జరుగుతోందని ఫిల్మ్ నగర్ టాక్. గత కొన్ని రోజులుగా ప్రముఖ నటి శోభితా ధూళిపాళ్ళతో నాగచైతన్య ప్రేమలో పడ్డారని గుసగుసలు వినిస్తూనే ఉన్నాయి. ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతుంది కదా. ఇప్పుడు ఆ ప్రచారమే నిజమైంది. అవును అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ళ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారట. వీరి ఎంగేజ్మెంట్ ఈ రోజే అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరగబోతోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
ఏమాయ చేసావే సినిమాలో తనకు జోడిగా నటించిన సమంత తో 2017 అక్టోబరు 6న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు నాగచైతన్య. ఐతే అనివార్య కారణాల వల్ల వీరి వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. వ్యక్తిగత అభి ప్రాయబేధాల నేపధ్యంలో నాగచైతన్య, సమంతలు పరస్పర అంగీకారంతో నాలుగేళ్ల తరువాత 2021లో విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇక వీరి విడాకులపై చాలా రకాల చర్చ జరిగింది. నాగచైతన్యదే తప్పని కొందరు, కాదు సమంతాదే తప్పని మరికొందరు సోషల్ మీడియా వేధికగా వాదించారు.
ఆ తర్వాత శోభితా ధూళిపాళ్ళతో నాగ చైతన్య ప్రేమలో పడ్డారని ప్రచారం జరిగింది. ఐతే ఇప్పటి వరకు వాళ్లిద్దరు దీనిపై స్పందించలేదు. ఇదిగో ఇప్పుడు హఠాత్తుగా వీళ్లిద్దరి వివాహ నిశ్చితార్ధం జరుగుతుందనే వార్త సంచసలనం రేపుతోంది. ఇరు కుటుంబాలు అంగీకారంతోనే నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ళ అతి కొద్ది మంది పెద్దల సమక్షంలో నిశ్చితార్ధం జరగనబోతుందని సమాచారం.