పొగాకు అదనపు పంటపై అపరాధ రుసుము రద్దు?

పొగాకు రైతులకు కేంద్రం శుభవార్త
సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్
ఇది ఏపీ పొగాకు రైతాంగానికి శుభవార్త అని పురందేశ్వరి ట్వీట్

ఢిల్లీ: పొగాకు అదనపు పంట అమ్మకం, అదనపు పంటపై వేసే అపరాధ రుసుము రద్దు గురించి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో చర్చించారు. అందుకు సానుకూలంగా స్పందించిన పీయూష్ స్పందించి అనుమతి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ‘ఇది ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతులకు ఆనందకరమైన వార’్త అని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ , వైస్ చైర్మన్ వాసు , పొగాకు రైతు నాయకులు పాల్గొన్నారు.