సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా `టిల్లు స్క్వేర్`. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. మార్చి నెలాఖరున సినిమా రిలీజవుతోంది. వేసవిలో మొదటి సినిమాగా ఈ చిత్రం రిలీజవుతోంది. తాజాగా ప్రమోషనల్ ఈవెంట్లో చిత్రబృందం మీడియాతో క్యూ అండ్ ఎలో పాల్గొంది. ప్రశ్నోత్తరాల్లో పలు ప్రశ్నలకు టిల్లు బృందం ఆసక్తికర సమాధానాలిచ్చింది. అయితే ఒక ప్రశ్న మాత్రం టిల్లును కొంత హర్ట్ చేసినట్టు అనిపించింది. దానిని లైటర్ వెయిన్ లో తీసుకున్నాడు సిద్ధూ. ఇంతకీ ఏమిటా ప్రశ్న అంటే.. మొదటి భాగంతో పోలిస్తే టిల్లు స్క్వేర్ లో అడల్ట్ డోస్ – యూత్ ఫుల్ డోస్ ఎక్కువైనట్టుంది కదా? అని జర్నలిస్ట్ ప్రశ్నించగా.. ఫస్ట్ మీరు ఉపయోగించిన పదాన్ని ఖండిస్తున్నాను. `అడల్ట్ డోస్` అనేది సరికాదు! అని వారించాడు సిద్ధూ. యూత్ ఫుల్ డోస్ అనే పదం కూడా ఉపయోగించాను అని జర్నలిస్టు సర్ధి చెప్పగా… ఆ రెండో పదం ఓకే సర్.. డిజే టిల్లు ఎలా ప్రవర్తిస్తాడు..? అనేది చూస్తే.. ఆ పాత్రకు ఒక డిమాండ్ ఉంటుంది. డిజే టిల్లు అనే పాత్రకు ఒక టింజ్ ఉంటుంది. వాడు ఒకలా ప్రవర్తించాలి. ఈ పాత్రకు కొన్ని బౌండరీలు ఉంటాయి. దాంట్లోనే ఉండాలి. మీరు యూత్ డోస్ ఉందని అంటున్నారు. వాడు మోసపోవడం మనసు విరిగిపోవడం అన్నిట్లో యూత్ ఫుట్ గా ఉంటాడు. రొమాన్స్ చేశాక మనసు విరిగిపోతుంది. డీజే టిల్లు ఒకలా ప్రవర్తించాలి. పొద్దున్నే తలస్నానం చేసి కులదైవానికి ప్రదక్షిణం చేసి అల్పాహరం చేసి కనిపిస్తే అది చూడటానికి నచ్చదు. టిల్లూ పాత్రకు ఒక రకమైన ప్రవర్తన ఉంటుంది… అని తెలిపారు. ఈ సినిమాలో అన్ని విషయాల్లోను డోస్ హై గా ఉండబోతోంది అని కూడా అన్నారు.
కొంతమంది నటీనటులు నటించేటప్పుడు బోల్డ్ క్యారెక్టర్స్‌లో నటించేసి దాన్ని ప్రశ్నిస్తే మాత్రం బోల్డ్ అనే పదాన్ని వాడొద్దని అది అంత బోల్డ్‌గా కనిపించేంత సీన్లు ఏమీ ఉండవు అంటారు. పాత్రకి తగ్గట్టు ఆ పాత్ర ఎలా ఉండాలో అలానే చేశాము కానీ అందులో వేరే ఉద్దేశం ఏమీ లేదంటారు. అంటే వీళ్ళు ఎంత బోల్డ్‌గన్నా యాక్ట్ చేయవచ్చుగాని ఎవ్వరూ ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే అది తప్పు.. అసలు బోల్డ్ అనే పదమే వాడొద్దు అంటున్నారు. అంటే పొట్టొ పొట్టి డ్రస్సులు వేసుకుని కొంచెం లిమిట్స్ దాటి యాక్ట్ చేసినా అది పాత్రలో రొమాన్స్ మాత్రమే అనుకోవాలి తప్పించి అంతకు మించి అనకూడదని అర్ధమవుతుంది. ఒక సినిమా కానీ.. ఒక పాట కానీ కుటుంబమంతా కలిసి చేసే విధంగా లేకపోతే దాన్ని బోల్డ్ కంటెంట్ అనే అంటారు. మరి ఆ అడల్ట్ అన్న పదానికి సిద్దుకి ఎందుకంత కోపమొచ్చిందో అని కొంత మంది సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంటున్నారు.