బాపట్ల కొరిసపాడు మండలం రావినూతల గ్రామంలో ప్రముఖ చలన చిత్ర హాస్య, విలక్షణ నటుడు గిరిబాబు 80 వ జన్మదిన వేడుకలు అత్యంత ఆర్భాటంగా జరిగాయి. గ్రామస్థులు,కుమారులు బోసు బాబు,నటుడు రఘుబాబు, కుటుంబ సభ్యులతో కలసి తన నివాసంలో గిరిబాబు పుట్టినరోజు కేకు ను కట్ చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు ఇతర గ్రామాల నుంచి వచ్చిన ప్రముఖులు గిరిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన శ్రేయోభిలాషులకు,అభిమానులకు,గ్రామ ప్రజలకు గిరి బాబు కృతజ్ఞతలు తెలిపారు.