వరద బాధితులకు సాయం

గుంటూరు, మహానాడు: స్థానిక కన్నావారి తోటలోని గుంటూరు తెలుగు బాప్టిస్ట్ సంఘం(మెయిన్ సర్వీస్) సభ్యులు విజయవాడ సింగ్ నగర్ లో వరద ప్రభావితులకు అందించనున్న 400 నిత్యావసర సరుకుల కిట్స్ వాహనాన్ని ఆదివారం నగర కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కిట్స్ అందించిన గుంటూరు తెలుగు బాప్టిస్ట్ సంఘం సభ్యులకు నగరపాలక సంస్థ తరుపున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామని, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు మున్ముందు కూడా సంఘం చొరవ చూపాలని కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు.